పవన్ ను చూస్తే జాలేస్తుంది..ఇక సినిమాలు చేసుకుంటే బెటర్

జనసేన, బీజేపీ పొత్తుపై తనదైన శైలిలో స్పందించారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్. పవన్ కల్యాణ్ రాజకీయాలు వదిలేసి, సినిమాలు చేసుకోవడం మంచిదన్నారు.ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడిన కేఏ పాల్..  పవన్ కు పవర్ ఉంటే  మోడీతో మాట్లాడి ఏపీకి ప్రత్యేక హోదా తేవాలన్నారు. రాజకీయ స్వార్థం కోసం ప్రజలను తప్పదోవ పట్టించవద్దన్నారు. పవన్ అధికారం కోసమే రాజకీయాల్లోకి వచ్చారని అందుకే పార్టీ పెట్టారన్నారు. పవన్ ను ప్రజలు నమ్మడం లేదన్నారు. అందుకే 8 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా పవన్ ఒక్క సీటు కంటే ఎక్కువ గెలవలేదన్నారు.
తానంటే ఎన్నికలకు ముందు వచ్చానన్నారు. పవన్ కు ఐదారు శాతం ఓటింగ్ కంటే ఎక్కవ రాదని..పవన్ కూడా ఓడిపోతాడని తాను ముందే చెప్పానన్నారు. పవన్ ను చూస్తుంటే జాలేస్తుందన్నారు. మొన్నటి వరకు టీడీపీతో ఉండి ఇపుడు బీజేపీతో కలిశారన్నారు. ఎన్నికలకు ఇంకా నాలుగున్నరేళ్లు ఉంటే అపుడే బీజేపీతో కలవడమేంటన్నారు. పవన్ డ్రామాలు, డ్యాన్సులు వేస్తే ఏపీకి పెట్టుబడులు రావన్నారు. పవన్ అసలు స్వరూపం బయటపడిందన్నారు.

Latest Updates