కబడ్డీ ఆటలో గాయపడి.. ఆస్పత్రిలో చనిపోయిన ఉద్యోగి

నిజామాబాద్ స్పోర్ట్ స్, వెలుగు: ఉద్యోగులకు రిక్రియేషన్ కోసం నిర్వహిస్తున్న క్రీడాపోటీల్లో శుక్రవారం అపశృతి చోటుచేసుకుంది. జిల్లాలోని డీఎస్ఏ మినీ స్టేడియంలో జరుగుతున్న నాన్ గెజిటెడ్​ ఉద్యోగుల ఆటల పోటీల్లో విషాదం జరిగింది. కబడ్డీ మ్యాచ్​లో ఓ ఆటగాడు గాయపడి, ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతూ చనిపోయాడు.

వివరాలు.. సిరిసిల్ల జిల్లా చిప్యాలపల్లి కి చెందిన జి.సురేష్ (29) మెంట్రాజ్ పల్లిలో జూనియర్​ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాడు. టీఎన్జీవో ఆటలపోటీల నేపథ్యంలో మిగతా వారితో కలిసి కబడ్డీ ఆటలో పాల్గొన్నాడు. పంచాయతీరాజ్ వర్సెస్ కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ జట్ల మధ్య జరిగిన క్వాటర్ ఫైనల్ మ్యాచ్ లో సురేష్ రైడిం గ్ కి వెళ్ళాడు. సురేష్ ను పట్టుకునే క్రమంలో మిగతా ఆటగాళ్లు అతనిపై పడ్డారు. దీంతో
సురేష్ అస్వస్థతకు గురయ్యారు. ఫస్ట్ ఎయిడ్ చేసి, అంబులెన్స్​లో ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి చేరిన కాసేపటికే పరిస్థితి విషమించి సురేష్ చనిపోయాడని డాక్టర్లు చెప్పారు.

తొమ్మిది నెలల క్రితమే విధుల్లోకి..

సురేష్ తొమ్మిది నెలల క్రితమే డిచ్​పల్లి మండలంలోని మెంట్రాజ్ పల్లిలో జూనియర్ పంచాయతీ సెక్రెటరీగా విధుల్లో చేరారు. విజయవాడకు చెందిన లావణ్యతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త చనిపోయిన విషయం తెలిసి ఆస్పత్రికి చేరుకున్న లావణ్య..సురేష్ మృతదేహంవద్ద భోరున విలపించారు.

మరిన్ని వార్తల కోసం

Latest Updates