రూ.250 కోట్లు.. దుమ్ములేపుతున్న కబీర్ సింగ్

వరంగల్ కుర్రాడు, టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీసిన కబీర్ సింగ్ మూవీ బాలీవుడ్ లో బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా రూపొందిన ఈ ‘అర్జున్ రెడ్డి రీమేక్’… 2019లో ఇప్పటివరకు రిలీజైన సినిమాల్లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. రూ.250కోట్ల వసూళ్లను దాటేసింది.

వరుసగా మూడోవారాంతంలోనూ కబీర్ సింగ్ వసూళ్లు బాగున్నాయని సినిమా ట్రేడర్లు చెబుతున్నారు. శుక్రవారం రూ.2.54 కోట్లు వసూలు చేసిన కబీర్ సింగ్.. శనివారం నాడు రూ.3.75కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఓవరాల్ గా శనివారం నాటికి కబీర్ సింగ్.. రూ.255.89 కోట్లు కొల్లగొట్టి బాక్సాఫీస్ కింగ్ అనిపించుకుంది కబీర్ సింగ్.

హీరో క్యారెక్టరైజేషన్ పై బయట విస్తృతంగా చర్చ జరుగుతోంది. డైరెక్టర్ డీల్ చేసిన విధానం బాలీవుడ్ ను ఆకట్టుకుంది. పాజిటివ్ టాక్ తో కబీర్ సింగ్ కలెక్షన్లు మరింతగా పెరగనున్నాయని ట్రేడర్లు చెబుతున్నారు.

2019లో ఉరీ, భారత్, కేసరి, టోటల్ ఢమాల్ లాంటి సినిమా రికార్డులను కబీర్ సింగ్ బ్రేక్ చేసింది. రూ.255 కోట్లు+ కౌంట్ కొనసాగుతోంది.

మరోవైపు.. హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 మూవీ.. తొలి రెండురోజుల్లో మంచి వసూళ్లు సాధించింది. ఆదివారంతో కలిపి రూ.50కోట్లు కలెక్షన్లు రావొచ్చనేది అంచనా. మూవీకి మిక్సుడ్ టాక్ రావడంతో.. ఫస్ట్ వీకెండ్ తర్వాత ఈ మూవీ కలెక్షన్లు ఎలా ఉంటాయన్నది ఆసక్తిగా మారింది.

Latest Updates