సంక్రాంతి స్పెషల్: పంచెకట్టులో కడప పోలీసులు

కడప: సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ కడప నగరంలో సాంప్రదాయ దుస్తులతో కనువిందు చేసింది పోలీసు యంత్రాంగం. ఎస్పీ అన్బురాజన్ ఆదేశాలతో కడప లోని ప్రతీ పోలీస్ స్టేషన్ లలో సంప్రదాయ దుస్తులతో హాజరయ్యారు సిబ్బంది. తమకు సొంత ఊర్లో ఉండి పండుగ చేసుకున్నట్లు ఉందని చెప్పారు పోలీసులు. డిఎస్పీ సూర్యనారాయణ నేతృత్వంలో సబ్ డివిజన్ లోని సిఐలు, ఎస్సైలు సిబ్బంది ప్రతి ఒక్కరూ పంచకట్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరంతా ఒకచోట కలుసుకుని సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే తమకు పండుగ రోజు  పంచకట్టు ధరించి డ్యూటీ కి రావడం సంతోషం గా ఉందన్నారు పోలీసులు. తమకు ఇలాంటి అవకాశం ఇచ్చిన జిల్లా ఎస్పీ అన్బురాజన్ తో పాటు డిఎస్పీ సూర్యనారాయణ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఈ సందర్భంలో ప్రతీ ఒక్కరూ సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగ జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు ఎస్పీ అన్బురాజన్.

Latest Updates