కాగజ్ నగర్ అడవి అందాల లోగిలి

ప్రకృతిలోని అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. అందులోనూ కాగజ్‌నగర్‌ అడవి అందాల గురించి చెప్పాలంటే.. మాటలు చాలవు. ఎటు చూసినా పచ్చని చెట్లు, గలగలా పారే వాగులు, విదేశీ పక్షుల సందడి, రకారకాల వన్యప్రాణులు కనిపిస్తుంటాయి. పైగా ఈ మధ్య తొలకరి జల్లులు కురవడంతో పచ్చికబయళ్లు , ప్రాణహిత, పెన్‌ గంగ, పెద్దవాగు ఈ అడవుల అందాన్ని మరింత పెంచాయి.

కాగజ్‌ నగర్, వెలుగు:
పక్షుల కిలకిలలు, పులుల గాండ్రింపులు, అడవి మృగాల ఆకలి వేట.. ఇవన్నీ కాగజ్‌ నగర్ అడవుల్లో చూడొచ్చు. బయో డైవర్సిటికీ కేరాఫ్‌ గా మారిన ఈ అడవి బెస్ట్ టూరిస్ట్ స్పాట్‌గా మారుతోంది. ఈ మధ్య కురిసిన వర్షాలకు ఎటు చూసినా పచ్చదనం పరుచుకున్నట్టు కనిపిస్తోంది. అడవి చుట్టూ నిరంతరం పారే ప్రాణహిత, పెన్ గంగ, పెద్దవాగు ఇక్కడ ప్రత్యేకం. ఎక్కడాలేని విధంగా ఈ అడవిలో వందకుపైగా సహజ సిద్ధమైన నీటి ఊటలు ఉన్నా యి. అందువల్ల ఎండాకాలంలో కూడా జంతువులకు నీటి ఇబ్బంది ఉండడంలేదు. కొన్నేళ్ల నుంచి మహారాష్ట్ర నుంచి కూడా పులులు వస్తున్నా యి.

స్పెషల్‌‌‌‌ ఈ ఫారెస్ట్
కాగజ్‌నగర్ ఫారెస్ట్ అన్ని విషయాల్లో స్పెషల్‌. దేశంలో అంతరించిపోతున్న పొడుగు ముక్కు రాబందులు(లాంగ్ బిల్డ్ వల్చర్) పెంచికల్‌ పేట్ రేంజ్‌ లోని పావురాల గుట్టల్లో ఉన్నాయి. ఏడేళ్ల క్రితం ఇక్కడ వాటి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ముప్పై రాబందులు ఉన్నా యి. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక రాబందుల స్పాట్. ఇదే రేంజ్ కొండపల్లి అడవిలో లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడ్డ వృక్ష శిలాజాలు ఉన్నా యి. వీటిని చూసేందుకు ఇటీవల స్టూ డెంట్స్, యువకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. అడవుల్లో అందమైన అరుదైన పక్షి జాతులకు కొదవే లేదు. విదేశీ పక్షులతో పాటు మనదేశ పక్షులు కూడా ఎన్నో ఉన్నా యి. ఈ మధ్య రాష్ట్రంలోనే మొదటిసారి ‘బర్డ్ వాక్’ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పక్షి ప్రేమికులకు మూడు రోజుల పాటు అడవుల్లో పక్షులను కెమెరాల్లో బంధించే అవకాశం ఇచ్చారు. 280 పక్షి జాతులు ఇక్కడ ఉన్నట్లు గుర్తించారు. ఇక పెద్దపులి సంచారం, నివాసం ఈ అడవికి మరో స్పెషల్‌. ఐదేళ్లుగా పెద్దపులి ఈ అడవిలో ఉంటోంది. ఇప్పటివరకు మూడు పిల్లలకు జన్మనిచ్చింది. అడవిలో చిన్న జంతువులకు కొదవలేదు. కాబట్టి పులికి కావాల్సినంత తిండి దొరుకుతోంది.

ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది
కాగజ్‌ నగర్ డివిజన్ ఫారెస్ట్‌‌‌‌లో ఐదు సంవత్సరాల నుంచి
రెగ్యులర్‌ గా ఫొటోలు తీస్తున్నా.. అయినా ఎప్పుడు అడవిలోకి వెళ్ళినా కొత్తగానే కనిపిస్తుంది. అడవి నుంచి తిరిగి వచ్చాక చూస్తే ఎన్నో స్పెషల్ ఫొటోస్ ఉంటాయి. పక్షులు, వన్య ప్రాణులు, వలస పక్షులు.. ఇలా అన్నీ ప్రత్యేకమే.
రాజేష్ కన్ని, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్

టూరిజం డెవలప్‌ మెంట్ కోసం
కాగజ్‌ నగర్ డివిజన్ ఫారెస్ట్ చాలా స్పెషల్‌. వన్యప్రాణుల, పులుల సంరక్షణ కోసం స్పెషల్‌ ప్లాన్ తయారు చేశాం. ఎకో టూరిజం డెవలప్‌ మెంట్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం . అడవి రక్షణకు, వైల్డ్ లైఫ్ కు ఇబ్బంది లేకుం డా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం . టైగర్, లాంగ్ బిల్డ్ వల్చర్, వుడ్ ఫాజిల్స్ త్వరలోనే టూరిస్ట్ స్పాట్‌‌‌‌లు అవుతాయి.
– విజయ్ కుమార్, కాగజ్‌ నగర్ ఎఫ్‌ డీవో

Latest Updates