కైలాస మానస సరోవర యాత్ర ప్రారంభం

ఇండియా, నేపాల్, చైనా సరిహద్దుల మీదుగా సాగే కైలాస మాసన సరోవర యాత్ర ఈ ఏడాది ప్రారంభమైంది. యాత్రికుల ఫస్ట్ బ్యాచ్ ను విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జయశంకర్ మాట్లాడారు. తమ సరిహద్దులమీదుగా యాత్రకు అనుమతించిన చైనాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపర్చేందుకు చైనా సుహృద్భావ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు.

కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లే యాత్రికులను విదేశాంగ శాఖ రెండు రకాలుగా అనుమతిస్తోంది. ఉత్తరాఖండ్ లోని లిపులేఖ్ నుంచి … సిక్కింలోని నాథు లా నుంచి కైలాస మానస సరోవర యాత్ర మొదలవుతుంది. ఈ ఏడాది ఉత్తరాఖండ్ నుంచి 18 బ్యాచ్ లు.. 10 బ్యాచ్ లు సిక్కిం నుంచి బయల్దేరి వెళ్లనున్నాయి. ఒక్కో బ్యాచ్ లో 50 మంది ఉంటారు. వేలమంది యాత్రికులు ఈసారి మానస సరోవర యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారని విదేశాంగ శాఖ తెలిపింది.

కొండలమీదుగా ట్రెక్కింగ్ చేస్తూ.. సుదీర్ఘంగా సాగే ఈ యాత్రకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇండియా, నేపాల్, చైనా దేశాలు ఈ బందోబస్తులో భాగం అయ్యాయి.

 

Latest Updates