కాజల్ న్యూ మూవీ..A సర్టిఫికెట్ ను మించి…

సౌత్‌ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కాజల్. చేతినిండా బోలెడు సినిమాలున్నాయి. వాటిలో ‘క్వీన్‌‌’ తమిళ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’ ఒకటి. రమేష్‌ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ మధ్యే సెన్సార్‌ కి వెళ్లింది. కానీ అక్కడ అనుకోని షాక్‌‌ తగిలింది. బోల్డ్‌ కంటెంట్‌ ఎక్కువయ్యిం దంటూ క్లియరెన్స్‌‌ ఇవ్వడానికి ని రాకరించింది బోర్డ్. ‘ఎ’ సర్టిఫికెట్ ఇవ్వడానికి కూడా నో అంది. ఒకవేళ రిలీజ్‌ కి అనుమతించాలంటే ఇరవైకి పైగా సన్ని వేశాలకు కోత పెట్టమన్నారట. కొన్ని మ్యూట్ ,బ్లర్ చేయమని చెప్పారట. దాంతో టీమ్‌ అదిరిపడ్డారు. అవన్నీ చేస్తే సినిమా ఏం మిగులుతుంది అని టెన్షన్ పడుతున్నారు. అయితే ఈ సినిమా తెలుగులో ‘మై నేమ్‌ ఈజ్‌ మహాలక్ష్మి’, కన్నడలో ‘బటర్‌ ఫ్లై’,మలయాళంలో ‘జామ్‌ జామ్‌ ’ పేర్లతో రీమేక్ అవుతోంది. మిగతా భాషల్లో ఆల్రెడీ సెన్సార్‌ సర్టిఫికెట్ వచ్చేసిం ది. కానీ తమిళంలో మాత్రం రాకపోవడంతో టీమ్ అవాక్కయ్యారు. చివరి నిమిషంలో అంత సినిమాను కట్ చేయలేం, కావాలంటే అవన్నీ ఉంచి ఎ సర్టిఫి కెట్ ఇవ్వమని కోరుతూ రివైజింగ్‌ కమిటీని సంప్రదిం చారట… ఎ సర్టిఫికెట్ ఉన్నా సినిమాలు బాగానే ఆడుతున్నాయన్న దీమాతో మరి కమిటీ ఏమంటుందో, కాజల్ సినిమా ఈ కష్టాలను ఎలా గట్టెక్కుతుందో తెలీదు కానీ… ఎ సర్టిఫికెట్‌ కూడా ఇవ్వనంత బోల్డ్‌ గా కాజల్ ఎలా నటించింది అంటూ కొందరు నెటిజన్స్‌‌ మాత్రం కూపీ లాగే పనిలో పడ్డారు. అందరికీ సినిమా కష్టాలొస్తే కాజల్ సినిమాకే కష్టం వచ్చిపడింది పాపం.

Latest Updates