చిరు ఆచార్యలో కాజల్.!

కాజల్ అగర్వాల్‌‌కు మళ్లీ అదృష్టం పట్టినట్టుంది. పదేళ్లకుపైగా కెరీర్‌‌‌‌లో అగ్ర హీరోల నుంచి చిన్న హీరోల వరకు జోడీ కట్టిన కాజల్.. ఇప్పటికీ అంతే జోరుగా సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న  క్రేజీ ప్రాజెక్టు ‘ఆచార్య’లో కాజల్ కన్‌‌ఫామ్‌‌ అయినట్లు సమాచారం. ‘ఖైదీ నెంబర్ 150’లో మెగాస్టార్‌‌‌‌తో చిందేసిన ఆమె…మరోసారి ఆయన పక్కన చాన్స్ కొట్టేసిందని టాలీవుడ్‌‌లో ప్రచారం జరుగుతోంది. కాజల్‌‌కు ఇది బంఫర్ ఆఫర్ అనే చెప్పాలి. ‘ఆచార్య’లో  చిరు సరసన త్రిష చేయాల్సి ఉండగా…ఆమె తప్పుకున్నట్టు ప్రకటించింది. ‘కొన్ని విషయాలు మొదట చెప్పినట్లు, చర్చించుకున్నట్టు కాకుండా భిన్నంగా మారుతుంటాయి. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగానే చిరు సర్  సినిమా నుంచి తప్పుకుంటున్నా. సినిమా యూనిట్‌‌కి నా అభినందనలు.  తెలుగు ప్రేక్షకులను మరొక మంచి ప్రాజెక్టుతో కలుస్తా’ అని త్రిష ట్వీట్ చేసింది. దీంతో త్రిష స్థానంలో కాజల్‌‌ను తీసుకోవాలని భావించిన చిత్రయూనిట్ వెంటనే ఆమెతో సంప్రదింపులు జరిపారట. ఒప్పుకున్న కాజల్ త్వరలో ఈ మూవీ షూటింగ్‌‌లో పాల్గొననుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మరో కీలక పాత్రకోసం రామ్ చరణ్‌‌ను అనుకున్నారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ ఆలస్యం కావడంతో మరోస్టార్ హీరో కోసం ప్రయత్నించారు. కానీ ఆ పాత్ర చరణ్ చేస్తేనే బాగుంటుందని చిరు చెప్పడంతో చరణే గెస్ట్ రోల్ చేస్తారని తెలిసింది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ  చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నాడు.

Latest Updates