ఇన్వెస్టర్ గా మారిన సినీ నటి కాజల్ 

ఓకే( ఓకెఐఈ) కంపెనీలో 15 శాతం వాటా కొన్న కాజల్ అగర్వాల్ కిచ్లూ

ముంబై: పెళ్లయి హనీమూన్ లో భర్త కిచ్లూతో ఎంజాయ్ చేస్తున్న సినీ నటి కాజల్ అగర్వాల్.. అప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టేసింది. తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ముంబైకి చెందిన ఓకే (okie) గేమింగ్ కంపెనీలో 15 శాతం వాటాలు కొనుగోలు చేసింది. దీని కోసం ఎంత మొత్తం చెల్లించిందనేది తెలియరాలేదు. కరోనా నేపధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మొబైల్.. ఎలక్ర్టానిక్ గాడ్జెట్స్ ఉపయోగం శరవేగంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే యూజర్లు పెరుగుతుండడంతో గేమింగ్ పరిశ్రమ కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతోంది. సినిమాలకు దాదాపు గుడ్ బై చెప్పిన కాజల్ అగర్వాల్.. సెకండ్ ఇన్నింగ్స్ గా బిజినెస్ ను ఆప్షన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలక్ర్టానిక్.. డిజిటల్.. గేమింగ్ పరిశ్రమలు వేగంగా అభివృద్ధి సాధిస్తుండడంతో ఇదే మంచి అవకాశంగా కాజల్ భావించి వాటాలు కొన్నట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్త కిచ్లూను పెళ్లి చేసుకున్న కాజల్ పెళ్లయ్యాక తొలి అడుగుగా గేమింగ్ కంపెనీలో వాటాలు కొనేసింది. ప్రాంతీయ గేమ్స్ తో మార్కెట్లోకి దిగిన ఓకే ప్లాట్ ఫాం ద్వారా కాజల్  మహిళల కోసం ప్రత్యేక గేమ్స్ అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

Latest Updates