కాజల్ మైనపు బొమ్మ.. అచ్చు కాజల్‌ను తలపించేలా..

లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగు సినీపరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. చందమామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఈ ముద్దుగుమ్మ మైనపు విగ్రహం మేడమ్ టుస్సాడ్స్‌లో చోటు దక్కించుకుంది. ఎంతోమంది ప్రముఖుల మైనపు విగ్రహాలు ఏర్పాటు చేసిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఇప్పుడు కాజల్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరించారు.

టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు డిసెంబర్ 17న ప్రకటించారు. ఆ దిశగా విగ్రహా తయారీ పనులన్నీ పూర్తిచేసి… ఈ రోజు కాజల్ చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాజల్ మైనపు బొమ్మను చూస్తే.. అంతా ఒరిజినల్ కాజలనే అనుకుంటారు. అంతలా అచ్చుగుద్దినట్లు తయారు చేశారు.

మేడమ్ టుస్సాడ్స్‌లో ఇప్పటికే తెలుగు పరిశ్రమ నుంచి డార్లింగ్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు బొమ్మలు కొలువుదీరాయి. తాజాగా వారి సరసన కాజల్ కూడా చేరారు. కాజల్ ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా మోసగాళ్లు చిత్రంలో నటిస్తుంది. అంతేకాకుండా కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారతీయుడు 2తో పాటు.. బాలీవుడ్‌లో క్రైమ్ స్టోరీగా రూపొందుతున్న ముంబాయి సాగాలో కూడా నటిస్తోంది.

Latest Updates