కరణ్, కాజోల్ జంటగా.. కపిల్ శర్మ షో

బాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్​ లిస్ట్ లో కచ్చితంగా ఉండేపేర్లు ‘కరణ్ జోహార్, కాజోల్ ’. 1995లో విడుదలైన‘దిల్ వాలే దుల్హా నియా లే జాయేంగే’ సినిమా నుంచి మొదలైన వీళ్ల స్నేహం ఇప్పటికీ కొనసాగుతోం ది. ఆ చిత్రంలో కాజోల్ హీరోయిన్ గానటించగా, ఒక స్నేహితుడి పాత్రలో కరణ్ జోహార్నటించాడు. వీళ్లిద్దరూ మళ్లీ కలిస్తే చూడాలని ఎప్పట్నుంచో అభిమానుల ఆశ. దీన్ని నిజం చేయబోతోంది ‘ది కపిల్ శర్మ షో’.

హిందీ సెలబ్రిటీ కామెడీ షో ‘ది కపిల్ శర్మ షో’. కపిల్ శర్మ నిర్వహించే ఈ షో ఎప్పుడూ టాప్ టీవీషోగా కొనసాగుతోంది. కపిల్ తన బృందంతో చేసే కామెడీతోపాటు, గెస్టులుగా వచ్చే అతిథులుకూడా ఈ షో సక్సెస్ కు ప్రధాన కారణం. బాలీవుడ్ కు సంబంధించిన స్టార్స్ దీనికి గెస్టులుగా వస్తుంటారు. త్వరలో ‘కరణ్, కాజోల్’లు అతిథులుగా రానున్నట్లు ‘ది కపిల్ శర్మ షో’ టీమ్ వెల్లడించింది. దాదాపు పాతికేళ్లుగా కాజోల్, కరణ్ లు మంచి ఫ్రెండ్స్​గా ఉన్నారు. ఇన్నేళ్లలో కాజోల్ టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగి, స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ ను పెళ్లి చేసుకుంది. ఇకకరణ్ జోహార్ బాలీవుడ్ లో అగ్ర దర్శకుడిగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. వీళ్లిద్దరూ కలిసి తమ మధ్య ఉన్న అనుబంధం గురించి వెల్లడించనుండటంతో అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన చిత్రీకరణ ఇటీవలే పూర్తైంది. షూటింగ్ కు చెందిన ఫొటోలు సోషల్ మీడియాలో అభిమానులు పోస్ట్​ చేస్తున్నారు.

 

 

 

Latest Updates