కడుపు నింపిన కాకా ఫౌండేషన్

మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పేదలకు కాకా వెంకట స్వామి ఫౌండేషన్‌ ద్వారా శనివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రోజూవారీ పనులు చేసుకునే మూడో వార్డు కృష్ణ కాలనీకి చెందిన పేదలు లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక పస్తులుంటున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకులు పెద్ద
పల్లి మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్‌ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన తన తండ్రి కాకా ఫౌండేషన్‌
ద్వారా నిత్యావసర సరుకులు పంపించారు. 30కుటుంబాలకు చెందిన వారికి 15 రోజులకు సరిపడా సరుకులను పంపగా స్థానిక నాయకులు బరపటి మారుతి, కొండ వెంకట్‌, జంగపెల్లి మహేశ్‌, రణధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వారికి అందజేశారు. తమ బాధ తెలుసుకుని సరుకులు అందించిన వివేక్‌వెంకటస్వామికి ఆ పేద కుటుంబాల వారు కృతజ్ఞతలు తెలిపారు. వివేక్‌ వెంకటస్వామి సూచనల మేరకు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని నాయకులు చెప్పారు. ప్రధాని పిలుపు మేరకు
నేటి రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెరుకు మోహన్, నల్లూరి సంతోష్, సిందం సందీప్, కర్నెశ్రీనివాస్, సిరికొండ రాజు, కర్నె ప్రదీప్, రాగిడి రవి, రొంతల సారయ్య, తంగల శ్రీకాంత్
పాల్గొన్నారు.

Latest Updates