కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్

గాంధీభవన్‌లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందని చెప్పిన నేతలు.. ఇప్పుడు నియంత పాలన సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత ఆరేండ్లలో రాష్ట్రంలో నిరుద్యోగులు పెరిగిపోయారన్నారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులన్నీ పెండింగులో ఉన్నాయని ఆయన అన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను  తరలిస్తున్నా.. కేసీఆర్ మాట్లాడటం లేదని ఉత్తమ్ మండిపడ్డారు.

For More News..

మా తొలి లక్ష్యం అదే

స్కూళ్లు తెరవొద్దని 2 లక్షల మంది పేరెంట్స్ పిటిషన్

Latest Updates