ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం

kaleshwaram-project-to-be-launched-on-june-21

విజయవాడకు వెళ్లి సీఎం జగన్ ను ఆహ్వానించనున్న సీఎం కేసీఆర్

రాష్ట్ర నీటిపారుదల రంగంలో కీలకమైన ప్రాజెక్టుగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమైంది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం కీలక ప్రకటన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ నెల 21న ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని KCR నిర్ణయించారు. త్వరలోనే విజయవాడకు స్వయంగా వెళ్లి జగన్ ను కేసీఆర్ ఆహ్వానించనున్నారు.

Latest Updates