నందిమేడారం వెట్​ రన్​ సక్సెస్

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో కీలకమైన భారీ నీటి పంపులు ఒకటొకటిగా పంపింగ్​కు సిద్ధమవుతున్నాయి. బుధవారం నందిమేడారం సర్జ్​పూల్​లో  3వ, 4వ మోటార్లకు వెట్​రన్​ను విజయవంతంగా నిర్వహించారు. మధ్యాహ్నం 12.50 నుంచి 12.45 గంటల వరకు మూడో మోటార్​ను నడిపారు. సాయంత్రం 6.40 నుంచి 7.10 గంటల వరకు నాలుగో మోటార్‌‌ను రన్‌‌ చేశారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్​సీ నల్లా వెంకటేశ్వర్లు, సీఎం ఓఎస్ శ్రీధర్​రావు దేశ్​పాండే, లిఫ్ట్​ ఇరిగేషన్​ సలహాదారు పెంటారెడ్డి, ట్రాన్స్​కో డైరెక్టర్​ సూర్యప్రకాష్​ తదితరులు పాల్గొన్నారు. గత నెలలో మొదటి రెండు మోటార్లకు విజయవంతంగా వెట్​రన్​ చేపట్టారు. మొత్తం ఏడు మోటార్లకు గాను 4 మోటార్లు పంపింగ్​కు సిద్ధంగా ఉండగా, వాటిని విజయవంతగా పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. 5, 6, 7 మోటార్ల నిర్మాణం కొనసాగుతోందని అన్నారు.

Latest Updates