కల్కి ఆశ్రమాల్లో మూడో రోజు ఐటీ సోదాలు

కల్కి భగవాన్‌ ఆశ్రమాల్లో మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గత రెండ్రోజులు జరిగిన ఐటీ సోదాల్లో రూ.33 కోట్ల విలువైన నగదు దొరికిందని, ఇందులో రూ.9కోట్ల విదేశీ కరెన్సీ ఉందని సమాచారం. కల్కి భగవాన్‌గా పిలుచుకొనే విజయకుమార్‌ పెద్దసంఖ్యలో ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఐటీశాఖ దేశవ్యాప్తంగా ఉన్న కల్కి ఆశ్రమాలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థల్లో బుధవారం నుండి సోదాలు చేస్తుంది. గురువారం చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలంలోని ఏకం ఆధ్యాత్మిక కేంద్రం, ఉబ్బలమడుగు సమీపంలోని ఆనంద్‌ లోక్‌లోని నాలుగు క్యాంపస్ లో, చెన్నై కార్యాలయాల్లో సోదాలు చేసిన అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కల్కి ఆశ్రమానికి చెందిన నిధులతో లాస్‌ఏంజెల్స్ లో కంపెనీ నడుపుతున్నారని, తమిళనాడు, ఆఫ్రికా దేశాల్లో భూములపై భారీగా పెట్టుబడులు పెట్టారని ఐటీశాఖ గుర్తించినట్లు తెలుస్తోంది.

Latest Updates