నేను పారిపోలేదు..నేమంలో ఉన్నా: కల్కీ

కల్కీ భగవాన్ ఆచూకీ లభ్యమైంది. తానొక మహా విష్ణు అవతారమని చెప్పే కల్కీ బాబా అలియాస్ విజయ్ కుమార్ నాయుడు భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఐటీ అధికారులు తెలిపారు. ఎల్ ఐసీ క్లర్క్  గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన 1990లలో తానొక మహా విష్ణు అవతారమని ప్రకటించుకొని ఫేమస్ అయ్యారు. పలురాష్ట్రాల ప్రజలు కల్కీకి భక్తులుగా మారీ భారీ ఎత్తున విరాళాలు సమర్పించారు. తనని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల వద్ద భారీ మొత్తంలో వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. భక్తులు సమర్పించిన విరాళాలతో దేశ విదేశాల్లో ఆస్తులు కూడబెట్టారు.

అక్రమాస్తులు సంపాదించారనే సమాచారంతో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో  రూ.44కోట్ల నగదు, రూ.20కోట్ల విదేశీ కరెన్సీ , వైట్ లోటస్ అనే పేరుతో తన కుమారుడి పేరుమీద చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, చిత్తూరు, కుప్పంలో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఐటీ అధికారులు తెలిపారు.

ఐటీ దాడులతో కల్కీ భగవాన్ విదేశాలకు పారిపోయారనే, ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై స్పందించిన కల్కీ తానెక్కడికి పారిపోలేదని, ఆరోగ్యంగానే ఉన్నానంటూ ఓ వీడియోను విడుదల చేశారు. ఎప్పటిగా భోదనలు జరిగే చెన్నై నేమంలోనే ఉన్నట్లు కల్కీ తెలిపాడు

Latest Updates