పెళ్లికి ముందే గర్భం : పుట్టబోయే బిడ్డ “గే” అయినా ఓకేనట

ఎవరైనా తమకు పుట్టబోయేబిడ్డ అందంగా ఉండాలి. అవయవాలు అన్ని సక్రమంగా ఉండాలి. తెలివిగలవారై ఉండాలని కోరుకోవడం కామన్. కానీ..బాలీవుడ్ హీరోయిన్ కల్కి కొచ్లిన్ తనకు పుట్టబోయే బిడ్డ థర్డ్ జెండర్ (గే) అయినా ఫరవాలేదు అని తెలిపి హాట్ టాపిక్ అయ్యింది. త్వరలోనే తాను తల్లిని కాబోతున్నాను అని తెలిపిన కల్కి..పుట్టబోయే బిడ్డ ఆడ, మగ లేదా..థర్డ్ జెండర్ అయినా డోంట్ కేర్ అని చెప్పింది. బాలీవుడ్ డైరెక్టర్, యాక్టర్ అనురాగ్ కశ్యప్ ను పెళ్లి చేసుకున్న కల్కి..2015లో విడాకులు తీసుకుంది.

ప్రజెంట్ ఇజ్రాయెల్ లోని జెరూసలెంకు చెందిన పియానిస్ట్ గయ్ తో ప్రేమలో పడిన కల్కి..మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపింది .పెళ్లి చేసుకోకుండానే తల్లి కాబోతుండటం గురించి కల్కి మాట్లాడుతూ..

నేను ఇప్పుడు ఐదు నెలల గర్భవతిని. నా బిడ్డతో ఎప్పుడు కనెక్ట్‌ అవాలో నాకు తెలుసు. ఇందుకోసం స్పెషల్ రూల్స్ ఏవీ పెట్టుకోలేదు.  గోవాలో పురుడుపోసుకోవాలని అనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది. దేవ్‌ డీ, రిబ్బన్‌, గల్లీబాయ్‌ వంటి పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది కల్కి.

Latest Updates