రోడ్డు ప్రమాదంలో కల్లూరు మార్కెట్ కమిటీ ఉద్యోగి మృతి

ఖ‌మ్మం జిల్లా: రోడ్డు ప్రమాదంలో కల్లూరు మార్కెట్ కమిటీ అసిస్టెంట్ సెక్రటరీ ఇనుముల బాలాజీ (36) మృతి చెందాడు. ఆఫీస్ పనిమీద శనివారం కొత్తగూడెం వెళ్లి రాత్రి 9 గంటల సమయంలో తిరిగి కల్లూరు కు వస్తుండగా సత్తుపల్లి మండలం తురకలగూడెం సమీపంలో మోటారుసైకిల్ అదుపుతప్పింది. దీంతో అత‌డు కిందపడి తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. రాత్రి సమయం కావడం చేత ఎవరూ చూడని నేపధ్యంలో సకాలంలో వైద్యం అందక మరణించాడు. ఉదయం తురకలగూడెం గ్రామస్తులు చూసి సత్తుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రమాకాంత్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు ఘటనా స్థలానికి చేరుకుని బాలాజీ మృతదేహాన్ని పంచనామా నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని మామ వెంకటరమణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Latest Updates