బతుకును ఆరాధించిన కవి కాళోజీ

  •  జయంతి వేడుకలో వక్తలు

హైదరాబాద్, వెలుగు: బతుకును ఆరాధించిన గొప్ప కవి కాళోజీ అని వక్తలు కొనియాడారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కాళోజీ నారాయణరావు 105వ  జయంతిని సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కాళోజీ నారాయణరావు పేరిట ఇస్తున్న సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వరరెడ్డికి ప్రదానం చేసి ఘనంగా సత్కరించింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హోంశాఖ మంత్రి మహమూద్​అలీ, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ హాజరయ్యారు. ఆత్మీయ అతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్​ డా. నందిని సిధారెడ్డి, సంగీత నాటక అకాడమి చైర్మన్​ బాదిమి శివకుమార్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, రామగుండ ఎమ్మెల్యే చందర్, మహబూబ్​నగర్​జడ్పీ చైర్మన్​స్వర్ణ, కాళోజీ ఫౌండేషన్​ నిర్వాహకుడు నాగిళ్ల రామశాస్త్రి పాల్గొన్నారు. హోంశాఖ మంత్రి మహమూద్​అలీ మాట్లాడుతూ తెలుగు భాషను గొప్పగా అభిమానించిన కవి కాళోజీ అని అన్నారు. తెలంగాణ ప్రాంత సాహిత్యం, సంస్కృతి,  జీవన విధానం ఎంతో ప్రత్యేకమైనవని  మంత్రి శ్రీనివాస్ గౌడ్​ పేర్కొన్నారు. తెలుగు కవులలో కాళోజీ ప్రత్యేకమని కొనియాడారు. వరంగల్ లో కాళోజీ కళాక్షేత్రం పూర్తయ్యేలా కృషి చేస్తానన్నారు. నందిని సిధారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వానికి అండగా ఉంటూ, తొలిదశ ఉద్యమానికి అండగా నిలిచారని అన్నారు.

అసెంబ్లీలో కాళోజీకి నివాళి

హైదరాబాద్, వెలుగు: ప్రజా కవి, స్వర్గీయ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా అసెంబ్లీలో ఆయన చిత్రపటానికి స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. సోమవారం ఉదయం అసెంబ్లీ లాబీలోని మెంబర్స్ లాంజ్​లో మంత్రులు హరీశ్​ రావు, ప్రశాంత్​ రెడ్డి, చీఫ్​ విప్​ దాస్యం వినయ్​భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Kaloji Narayana Rao 105th birth anniversary celebrations in Ravindra Bharati on Monday.

Latest Updates