మేనేజ్‌మెంట్‌‌ సీట్ల భర్తీకి మరో రౌండ్ కౌన్సెలింగ్‌

నోటిఫికేషన్ ఇచ్చిన కాళోజీ వర్సిటీ

హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని మేనేజ్ మెంట్ కోటా సీట్ల భర్తీకి అడిషనల్‌ మాప్ అప్‌ రౌండ్‌ నిర్వహించాలని కాళోజీ వర్సిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 10న సాయంత్రం 4 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 4 గంటల వరకూ వెబ్‌ ఆప్షన్ల నమోదుకు గడువిచ్చిం ది. ఈ నెల 4వ తేదీతో ముగిసిన మూడో రౌండ్ కౌన్సెలింగ్ తర్వాత 161 సీట్లు మిగిలాయని ఆదివారం ప్రకటిం చారు. వీటిని ఈ రౌండ్‌లో కేటాయించనున్నారు. ఇందులో సీ కేటగిరీ(ఎన్నారై) సీట్లు 92ఉండగా, బీ కేటగిరీ సీట్లు 77 ఉన్నాయి. బీ కేటగిరీ సీటు ఫీజు రూ.12 లక్షల వరకూ ఉండగా సీ కేటగిరీ సీటు ఫీజు రూ.24 లక్షల వరకు ఉంది. ఏపీలోని కాలేజీల్లో సీట్లు పొందిన స్టూడెంట్లను ఈ రౌండ్‌లో పాల్గొనేందుకు
అనర్హులుగా ప్రకటించారు.

Latest Updates