చెడ్డపేరు రాకూడదని జాగ్రత్తపడుతున్నా: కళ్యాణ్ రామ్

వైవిధ్యభరిత చిత్రాల్లో నటించడమే తనకు ఇష్టమంటున్నారు కళ్యాణ్ రామ్. ఆయన హీరోగా గుహన్ దర్శకత్వంలో మహేష్ కోనేరు నిర్మించిన ‘118’ చిత్రం మార్చి 1న విడుదలవుతోంది. ఆ సందర్భంగా కళ్యాణ్ రామ్ ఇలా ముచ్చటించారు.

కథ వినగానే ఎక్సైటింగ్‌‌‌‌గా అనిపించింది. తప్పకుండా వైవిధ్యభరిత చిత్రం అవుతుందనిపించింది. దర్శకులు గుహన్ జీవితంలో ఒకటే సంఘటన మళ్లీ మళ్లీ జరిగింది. దాన్ని ఎలా ఎదుర్కోవచ్చనేది హీరో క్యారెక్టర్‌ కి ఆపాదించి ఈ కథ సిద్ధం చేశారు. హీరోకి క్యూరియాసిటీ ఎక్కువ. ఆ ఆసక్తితో అతనేం చేశాడన్నది కథాంశం. అలాగని సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ లాంటివేమీ ఇందులో ఉండవు.

• రక్షణ, అన్వేషణ వంటి చాలా టైటిల్స్ అనుకున్నాం . అవన్నీ రొటీన్‌‌‌‌గా అనిపించాయి. సినిమాకి సంబంధం ఉంటూనే ఆసక్తిగా అనిపించే టైటిల్ అని ‘118’ను ఎంచుకున్నాం .

• స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే సినిమా ఇది. తెరపై కనిపించే హీరో, తెరముందు చూస్తున్న ప్రేక్షకుడి ఆలోచనా ధోరణి ఒకేలా ఉంటుంది. ఇది స్ట్రెయిట్ నేరేషన్ సినిమా. ముంబైలో వాటర్ సీక్వెన్సులు చేశాం . ఈ సినిమా కోసం నేను ఈత నేర్చుకున్నాను.

• ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా నటించాను. సినిమాటిక్ డైలాగ్ మాడ్యులేషన్ కాకుండా నేచురల్‌‌‌‌గా కావాలనేవారు డైరెక్టర్ . నాకు కొంచెం కష్టంగా అనిపించింది.

•నివేదా థామస్ పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. ఎమోషనల్ సీన్స్‌‌‌‌లో అద్భుతంగా నటిస్తుందామె. గత చిత్రాల్లోని నటనే అందుకు నిదర్శనం. ఇందులోని పాత్రకు నివేదానే న్యాయం చేయగలదని భావించి.. ఆమెను సంప్రదించాం . కథ నచ్చడంతో వెంటనే అంగీకరించింది.

• సినిమాటోగ్రాఫరే డైరెక్టర్ అవడం ఈ సినిమాకు మరింత కలిసొచ్చింది. ఆయన కాకుంటే ఇంత బాగా వచ్చేదని నేను చెప్పలేను. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకముంది. ముఖ్యంగా చివరి అరగంట చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

• నేనెప్పుడూ వైవిధ్యభరిత చిత్రాలనే చేయాలనుకుంటాను. పదేళ్ల క్రితమే అవిభక్త కవలల నేపథ్యంలో ‘హరే రామ్’ సినిమా చేశాను. ‘పటాస్’ కూడా నేనప్పటికి ప్రయత్నించని జానర్. అది హిట్టవడంతో చాలామంది నాతో అలాంటి సినిమాలే చేయాలనుకున్నారు.

• కమర్షియల్ అంశాలకు కొలమానమంటూ ఏముంది? డ్యూయెట్లు, కొన్ని కామెడీ సీన్స్, ఓ ఐటమ్ సాంగ్ ఉంటేనే కమర్షియల్ సినిమా అంటే ఇందులో అవేవీ ఉండవు. కానీ ఇది కమర్షియల్ సినిమానే. రేసీ స్క్రీన్ ప్లేతో ఏం జరగబోతోంది అనే క్యూరియాసిటీతో ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేస్తుంది.

• ఇన్వెస్టిగేటివ్ సస్పె న్స్ థ్రిల్లర్‌ కి ఎమోషన్స్ జత చేశాం . థ్రిల్లర్స్‌‌‌‌లో ఎమోషన్ అనేది అరుదైన కాంబినేషన్. యూత్‌ కి ఈ సినిమా బాగా నచ్చుతుందని భావిస్తున్నాను.

• పరాజయాలకు ఎవరూ అతీతులుకారు. ఏ సినిమాకైనా ఆరు నెలలపాటు కష్టపడతాం . పరాజయాలొస్తే ఎందుకలా జరిగిందని పునరాలోచించుకుంటాం . ప్రేక్షకుల కోణంలో ఆలోచించి తదుపరి సినిమా విషయంలో తప్పులు జరగకుండా జాగ్రత్తపడతాం .

• సోషల్ మీడియాలో నేనంత చురుకుగా ఉండను. కానీ నెట్‌ ఫ్లిక్స్ వంటి డిజిటల్ ప్లాట్‌ ఫామ్స్‌‌‌‌లో వెబ్ సిరీస్‌‌‌‌లు, డాక్యుమెంటరీలు చూస్తుంటాను. నా నిర్మాణంలో వెబ్ సిరీస్ ఒకటి జరుగుతోంది. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే టీనేజ్ లవ్స్టోరీ. ప్రస్తుతం యూత్ వాటినే ఎక్కువగా చూస్తున్నారు. కంప్లీట్ అయ్యాక పూర్తి వివరాలు ప్రకటిస్తాను.

• నేను పరిచయం చేసిన దర్శకులు మంచి విజయాలు అందుకోవడం సంతోషం. నాతో పాటు నా బ్యానర్‌ కి కూడా అది గర్వకారణం. చెత్త సినిమా తీశారనే చెడ్డపేరు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌ కి రాకూడదని జాగ్రత్త పడుతుంటాను.

• కొత్త చిత్రాల విషయంలో కొన్ని మంచి స్క్రిప్టులు విన్నాను. ఈ సినిమా విడుదలయ్యాక వాటిపై నిర్ణయం తీసుకుంటాను.

Latest Updates