లబ్ధిదారురాలికి ఇచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కు చెల్లట్లే..

గద్వాల, వెలుగు: లబ్ధిదారురాలికి ఇచ్చిన కల్యాణలక్ష్మి చెక్కు చెల్లలేదు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ లో జరిగింది. ధరూర్ మండల కేంద్రానికి చెందిన శంకరమ్మ, వెంకటన్నకూతురి పెళ్లి గత ఏడాది జరిగింది. గత నెల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మండలంలోని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.శంకరమ్మకు కూడా రూ. 1,00,116 చెక్కు వచ్చింది. వారు ధరూర్ ఏపీ జీవీబీ బ్యాంకులో చెక్కు డిపాజిట్ చేశారు. బ్యాంకుకి వెళ్లి డబ్బుల కోసం ఆరా తీయగా చెక్కు వెనక్కి వచ్చిందని, దానిపై ఇదివరకే డబ్బులు డ్రా చేశారని చెప్పారు. చెక్కు డబుల్ ఎంట్రీ జరిగి ఉండొచ్చని లేదా ఎస్బీఐ ఆఫీసర్లు పొరపాటు పడి ఉండొచ్చని ధరూర్ ​ఏపీజీవీబీ బ్యాంకు ఆఫీసర్లు అన్నారు. వాళ్లకి డబ్బులు తప్పకుండా వస్తాయన్నారు .

Latest Updates