అప్పుడు పుట్టివుంటే బాగుండేదేమో!

తండ్రి ప్రియదర్శన్ ఫేమస్ డైరెక్టర్. తల్లి ఒకప్పుడు పాపులర్ నటి. ఈ ఇద్దరి టాలెంట్స్‌‌‌‌ కలుపుకుని పుట్టింది కళ్యాణి. టెక్నీషియన్​గా కెరీర్​ ప్రారంభించి నటిగా మారింది. శర్వానంద్‌‌‌‌తో కలిసి ఆమె నటించిన ‘రణరంగం’ ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా కళ్యాణి చెప్పిన కబుర్లు…

 •                  సుధీర్‌‌‌‌‌‌‌‌వర్మ కథ చెప్పినప్పుడే నేను ఇంప్రెస్ అయిపోయాను. స్క్రీన్‌‌‌‌ప్లే డిఫరెంట్‌‌‌‌గా ఉంది. గతాన్ని, ప్రస్తుతాన్ని వేర్వేరుగా చూపిస్తుంటారు కానీ ఒకేసారి కనబడతాయి. అందులోని బ్యూటీ సినిమా చూస్తే అర్థమవుతుంది.
 •                 ఓ వ్యక్తి ఇరవయ్యేళ్ల ప్రయాణమే ఈ సినిమా. ఓ సాధారణ యువకుడు డాన్‌‌‌‌గా ఎలా ఎదిగాడో చూపిస్తారు. శర్వానంద్ పాత్రలోని రెండు షేడ్స్‌‌‌‌లో చాలా వేరియేషన్‌‌‌‌ ఉంటుంది. నాకు చిన్నప్పట్నుంచీ గ్యాంగ్‌‌‌‌స్టర్ మూవీస్ అంటే ఇష్టం.
 •                 సినిమా మొత్తం శర్వా పాత్ర చుట్టూ తిరుగుతుంది. బరువైన క్యారెక్టర్. తనలోని లవర్​ని వెలికితీసే రోల్ నాది. లంగావోణీలు వేసుకుని విలేజ్​ అమ్మాయిగా కనిపిస్తాను. ఈ పాత్ర కోసం మా అమ్మ, శోభనగారు చేసిన సినిమాలు చూశాను.
 •                 నాకు పాత సినిమాలంటే చాలా ఇష్టం. ఇప్పటికీ 80, 90ల నాటి మూవీస్ టీవీలో వస్తే చూస్తుంటాను. నేను కూడా ఆ సమయంలో పుట్టివుంటే బాగుండేది కదా అని చాలాసార్లు అనుకున్నాను. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు నా ఆశ నెరవేరినట్టనిపించింది. నాటి అమ్మాయిలా కనిపించడాన్ని చాలా ఎంజాయ్ చేశాను.
 •                 నేను స్వతహాగా మలయాళీ. పెరిగిందేమో చెన్నై. అందుకే మలయాళం, తమిళం బాగా వచ్చు. అయితే హీరోయిన్‌‌‌‌గా ఎక్కువ చేస్తున్నది తెలుగులో. కాబట్టి తెలుగు పూర్తిగా నేర్చుకుంటాను.
 •                 నేనసలు హీరోయిన్ అవుదామనుకోలేదు. అనుకోకుండా ఇటువైపు అడుగేశాను. నేను నటిగా మారతానంటే మా అమ్మ చాలా సంతోషపడింది.
 •                 పాత్ర నిడివిని పట్టించుకోను. నా పాత్రకు ప్రాధాన్యత ఉందా లేదా, మంచి పేరొస్తుందా లేదా అనే ఆలో
  చిస్తాను. కెరీర్​ స్లోగా ఉండటానికి కారణం నేను సెలెక్టివ్​గా సినిమాలు ఎంచుకోవడమే.
 •                 నటనంటే నాకెంత ఇష్టమో డైరెక్షన్ అన్నా అంతే ఇష్టం. తప్పకుండా ఏదో ఒకరోజు మెగాఫోన్ పడతాను. అదెప్పుడన్నది మాత్రం ఇప్పుడే చెప్ప
  లేను. నా మనసులో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అవి కథలుగా మారినరోజు డైరెక్టర్ చెయిర్‌‌‌‌‌‌‌‌లో కూర్చుంటాను.
 • మా నాన్న డైరెక్షన్‌‌‌‌లో ‘మరక్కర్‌‌‌‌‌‌‌‌’ అనే  మూవీలో నటించాను. మోహన్‌ లాల్ హీరో.  నేనిందులో యాక్ట్ చేస్తానని మా నాన్నను అడిగి మరీ ఒక పాత్ర తీసుకున్నాను. కానీ ఆయన డైరెక్షన్‌‌‌‌లో నటించడం నాకు చాలా కష్టమనిపించింది. షూటింగ్‌‌‌‌ జరిగినన్నాళ్లూ నాన్న ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సినిమా పూర్తయ్యాక మాత్రం ‘ఓ దర్శకుడికి ఒక నటి నుంచి ఏం కావాలో ఆ ఔట్‌‌‌‌పుట్ ఇచ్చావ్’ అంటూ మెచ్చుకున్నారు. చాలా హ్యాపీగా ఫీలయ్యా.

Latest Updates