హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్.. NTR కొత్త స్టిల్

ఇంటర్నెట్ న్యూస్ : NTR బయోపిక్ కోసం ఇప్పటికే ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం ఆసక్తి పెంచుతోంది. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ పాత్రను .. హరికృష్ణ కుమారుడు కల్యాణ్ రామ్ పోషిస్తున్నాడు. NTR సినిమాలో తాను పోషిస్తున్న పాత్రకు సంబంధించి ఓ ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ఆసక్తికరమైన కామెంట్ పెట్టాడు కల్యాణ్ రామ్.

“30 ఏళ్ల క్రితం మా బాబాయ్ తో ‘బాలగోపాలుడు’ సినిమాలో బాలుడిలా నటించాను. మళ్లీ ఇప్పుడు .. బాబాయ్, వాళ్ల నాన్న గారిలా… నేను, మా నాన్నగారిలా.” అని ఓ కామెంట్ రాసి ఆసక్తి పెంచాడు కల్యాణ్ రామ్. చైతన్య రథం ముందు నిలబడి హరికృష్ణతో ఎన్టీఆర్ మాట్లాడుతున్న సన్నివేశానికి సంబంధించిన ఫొటోను కల్యాణ్ రామ్ పోస్ట్ చేశాడు. ఎన్నికల వేళ ఎన్టీఆర్ చైతన్యరథాన్ని హరికృష్ణే నడిపాడు. అలా.. కల్యాణ్ రామ్ తన తండ్రి పాత్రలో ఓ కీలకమైన రోల్ పోషిస్తున్నట్టుగా చెప్పొచ్చు.

Posted in Uncategorized

Latest Updates