రజనీకాంత్ మద్దతు కోరతా: కమల్

ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా.. తన సహచర నటుడు రజనీకాంత్‌ మద్దతు కోరతానని మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు, నటుడు కమల్‌ హాసన్‌ తెలిపారు. రజనీ మద్దతు తనకెంతో ఉపయోగపడుతుందన్నారు. పార్టీ పెట్టేందుకు సిద్ధమైన రజనీకాంత్‌…అనారోగ్య సమస్యల కారణంగా ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు.ఈ క్రమంలో తలైవా మద్దతు కోరతానని కమల్‌ అన్నారు. స్నేహితునిగా..ఆయన మద్దతు తనకెంతో మేలు చేస్తుందని చెప్పారు. ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నారని… ఇది అవినీతికి, నిజాయితీకి మధ్య యుద్ధమన్నారు కమల్.

Latest Updates