ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లిన కమల్

గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియగానే… నటుడు, రాజకీయ నాయకుడు కమల్‌హాసన్‌ గురువారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లారు. కరోనా నుంచి కోలుకున్న బాలు ఆరోగ్య పరిస్థితి గత 24 గంటల్లో విషమించిందని ఎంజీఎం బులిటెన్‌ విడుదల చేసింది. ఎక్మోతో పాటు, ఆయనకు ప్రాణాధార వ్యవస్థ ద్వారా ట్రీట్ మెంట్ అందిస్తున్నాట్లు  MGM డాక్లర్లు తెలిపారు. ఈ క్రమంలో కమల్‌హాసన్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. బాలు ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను, ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు కమల్.

Latest Updates