కమల్ హాసన్‌‌కు సర్జరీ.. త్వరలోనే డిశ్చార్జ్

చెన్నై: ప్రముఖ సినీ హీరో, మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్‌‌ హాసన్‌‌‌కు సర్జరీ అయ్యింది. మంగళవారం ఆయన కాలికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. మరో ఐదు రోజుల్లో కమల్‌‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారని ఆయన కూతురు, సినీ హీరోయిన్ శ్రుతి హాసన్ తెలిపారు. ఈ మేరకు తన తండ్రి కోలుకోవడానికి ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు చెబుతూ ఆమె ఓ లెటర్‌‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కమల్‌‌కు చేసిన సర్జరీ సక్సెస్ అయ్యిందని, త్వరగా కోలుకుంటున్నారని ఆ లేఖలో శ్రుతి పేర్కొన్నారు. కమల్ కోలుకున్న వెంటనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తొలిదశ క్యాంపెయినింగ్‌‌లో  జాయిన్ కానున్నారని సమాచారం.

Latest Updates