ఇంటలిజెన్స్ హెచ్చరికలు ఉన్నా.. కేంద్రం ముందస్తు చర్యలు తీసుకోలేదు : కమల్

సరిహద్దుల్లో సైనికుల ప్రాణాలు పోతుంటే కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు అపోజిషన్ పార్టీ నేతలు. అమరజవాన్ల అంత్యక్రియల్లో కేంద్రమంత్రులు నవ్వుతున్నారని మండిపడ్డారు. ఇంటలిజెన్స్ హెచ్చరికలు ఉన్నా.. కేంద్రం ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సినీ హీరో, మక్కల్ నీది మయ్యం అధినేత కమలహాసన్ కశ్మీర్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పుల్వామా ఘటనను ఖండించిన కమల్.. ఇంత విధ్వంసకాండ జరుగుతుంటే కేంద్రం కశ్మీర్ లో ప్రజాభిప్రాయం ఎందుకు సేకరించడంలేదని ప్రశ్నించారు. అక్కడి ప్రజలు కోరుకున్నట్లుగా చేయాలన్న కమల్ వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి.ఇంటలిజెన్స్ హెచ్చరికలు ఉన్నా.. కేంద్రం ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు కమల్.

దాయాది పాకిస్థాన్ తో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడే అవకాశమే లేదన్నారు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా. పాక్ ఉగ్రవాదానికి సపోర్ట్ చేయడం మానుకోవాలని సూచించారు. ప్రభుత్వ అంగీకారం లేకుండా పాకిస్తాన్ తో క్రికెట్ ఆడే ప్రసక్తే ఉండదన్నారు.

Latest Updates