నోరు పారేసుకున్న ట్రంప్ : క‌మ‌లా హ్యారిస్ న‌ల్ల‌జాతీయురాలు, ఉపాధ్యక్షురాలిగా ప‌నికి రారు

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటికి ప‌ని చెప్పారు. త్వ‌ర‌లో అమెరికాలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా కొన‌సాగుతుంది. అధ్య‌క్ష ‌ప‌దవిలో ఉన్న ట్రంప్ త‌న అభ్య‌ర్ధి డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ , ఉపాధ్య‌క్ష ప‌ద‌విలో ఉన్న క‌మ‌లా హ్యారిస్ పై నోరు పారేసుకుంటున్నారు.

జో బిడెన్ త‌న పార్టీ త‌రుపున ఉపాధ్య‌క్ష ‌ప‌ద‌వికి క‌మ‌లా హ్యారిస్ ను ఎంపిక చేసిన త‌రువాత ట్రంప్ వ్యాఖ్య‌లు తారాస్థాయికి చేరుకున్నాయి. వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ట్రంప్ మాట్లాడుతూ క‌మలా న‌ల్ల‌జాతీయురాలు. ఆమె త‌ల్లిదండ్రులు వ‌ల‌స వ‌చ్చారు. ఆమె ఇక్క‌డ జ‌న్మించ‌లేదు. అలాంటి వ్యక్తి అమెరికాకు ఉపాధ్యక్షురాలిగా పనికిరారు. వైట్‌హౌస్‌ అవసరాలను తీర్చడానికి ఆమె అర్హురాలు కాదు అంటూ ట్రంప్ జాత్యంకార వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవ్వడానికి ఆమెకు అర్హత లేదన్నారు.

ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవ్వడానికి కమలా హ్యారిస్‌కు అన్ని అర్హతలు ఉన్నాయ‌ని, ఆమె కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో జన్మించారని.. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవ్వడానికి ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఆమె వివరాలను పరిశీలించిన న్యాయవాదులు కూడా దీని గురించి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలిపారు. ఈ క్రమంలో లయోలా లా స్కూల్‌ ప్రొఫెసర్‌ జెస్సికా లెవిన్సన్ నిజాయితీగా ఉండండి. ఇక్కడ రంగు, తల్లిదండ్రులు గురించిన వ్యాఖ్యలు అనవసరం. పైగా ఇవి పూర్తిగా జాత‍్యంహకార వ్యాఖ్యలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest Updates