కమలా హ్యారిస్ కు ఏ బ్రేక్ ఫాస్ట్ ఇష్టమో తెలుసా..?

కమలా హ్యారిస్..అమెరికాకు కాబోయే వైస్​ ప్రెసిడెంట్. భారత సంతతికి చెందిన ఆమె అమెరికాకు మొట్టమొదటి మహిళా వైస్ ​ప్రెసిడెంట్​ కానున్నారు. ఈ నేపథ్యంలో కమలా హ్యారిస్ ప్రతీ రోజు ఏం బ్రేక్ ఫాస్ట్ తింటారు. ఎన్నికల ప్రచారంలో మెంటల్ హెల్త్ స్ట్రాంగ్ గా ఉండేందుకు ఎలాంటి టిప్స్ పాటించారో నెటిజన్లతో పలు ఆసక్తిర విషయాల్ని పంచుకున్నారు. ముఖ్యంగా తన రోజువారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశారు. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా వంటకాలంటే ఇష్టమని చెప్పిన హ్యారిస్..ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే వర్కౌట్లు చేయడం, వంట చేయడం అంటే ఇష్టమని చెప్పారు.

మహిళలు ఆయా రంగాల్లో పై చేయిసాధించాలంటే ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. ఇక సౌత్ ఇండియాలో ఇండ్లీ, సాంబరు తనకెంతో ఇష్టమని, నార్త్ ఇండియాలో టిక్కా అంటే చాలా ఇష్టమంటూ అమెరికాకు కాబోయే వైస్​ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ తన అభిరుచుల్ని నెటిజన్లతో పంచుకున్నారు.

Latest Updates