దిశపై నోరుపారేసుకున్న కామారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్

నలుగురు దుర్మార్గుల చేతిలో అత్యాచారానికి గురై, ఆ తర్వాత పాశవికంగా పెట్రోల్ పోసి చంపబడ్డ దిశ ఘటనపై కామారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్ శోభ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దిశ తన తల్లిదండ్రులతో సఖ్యతగా లేదేమో అనిపిస్తుందని ఆమె అన్నారు. నిందితులు అడ్డుకున్నప్పుడు తల్లిదండ్రులకు చెప్పే దైర్యం లేక దిశ తన చెల్లెలికి ఫోన్ చేసిందని ఆమె అన్నారు. చెల్లెలికి కాకుండా తండ్రికి ఫోన్ చేసి ఉంటే ఆయన వచ్చి తీసుకువెళ్లేవారు కదా అని ఆమె అన్నారు.

గెజిటెడ్ అధికారిగా ఉన్న దిశకు ఎవరికి ఫోన్ చేయాలో కూడా తెలియదా అని ఆమె ప్రశ్నించారు చైర్‌పర్సన్ శోభ. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ప్రభుత్వం మాత్రం ఎంతమందిని రక్షిస్తుందని ఆమె అన్నారు. ఇప్పటికైనా దిశ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆమె అన్నారు. అవగాహన కార్యక్రమాల వల్ల ఒక్కరు మారిన చాలని ఆమె అన్నారు. దిశ ఘటనపై ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

నిన్న జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన మహిళా శిశు సంక్షేమ సంఘ సమావేశంలో ఆమె పైవిధంగా మాట్లాడారు. ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని, వాటన్నింటిని ప్రభుత్వంపై రుద్దడం కరెక్ట్ కాదని ఆమె అన్నారు.

For More News..

రూ. 21కి కొంటే రూ.85లక్షలకు అమ్ముడైంది

రేప్‌లు జరగొద్దంటే.. మగవాళ్లు ఇలా చేయాలి

Latest Updates