ట్రయల్స్ కు కంబళ రేసర్ నో!

న్యూఢిల్లీ:  స్పోర్ట్స్‌‌ అథారిటీ ఆఫ్‌‌ ఇండియా (సాయ్‌‌) అధికారులకు కంబళ రేసర్‌‌ శ్రీనివాస గౌడ షాకిచ్చాడు.  బెంగళూరు సాయ్‌‌ సెంటర్‌‌లో  ట్రయల్స్‌‌కు హాజరయ్యేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. గౌడను కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సోమవారం బెంగళూరులోని తన కార్యాలయంలో అభినందించారు. ఇదే సమయంలో గౌడను తమ వెంట తీసుకెళ్లడానికి సీఎం ఆఫీస్‌‌కు సాయ్‌‌ బృందం చేరుకుంది. కానీ, వారితో కలిసి సాయ్‌‌ సెంటర్‌‌కు వెళ్లేందుకు అతను నిరాకరించినట్లు సమాచారం. అతను గాయంతో బాధపడుతున్నట్టు అధికారులు గుర్తించారట.

Latest Updates