కంబళ పోటీ: శ్రీనివాస గౌడ రికార్డును బ్రేక్ చేసిన నిశాంత్ శెట్టి

కర్ణాటకలో నిర్వహించే సంప్రదాయ కంబళ పోటీల్లో రికార్డులు బ్రేక్ చేస్తున్నారు పోటీదారులు. పోటీల్లో ఇప్పటి వరకు శ్రీనివాస గౌడ అనే యువకుడు 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలో పరుగెత్తి రికార్డు సృష్టించాడు. అంతే శ్రీనివాసను.. ఉసేన్ బోల్ట్ తో పోల్చారు. బోల్డ్ 100 మీటర్లను దూరాన్ని 9.58 సెకన్లలో పరిగెత్తి వరల్డ్ రికార్డు నమోదు చేస్తే… శ్రీనివాస గౌడ అంత కంటే సమయంలోనే టార్గెట్ ను రీచ్ అయ్యాడంటూ పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఆ రికార్డు ఎంతో సమయం నిలవలేదు. కంబళ పోటీల్లో శ్రీనివాస గౌడ రికార్డును బ్రేక్ చేశాడు నిశాంత్ శెట్టి అనే రన్నర్.

నిశాంత్ శెట్టి అనే యువకుడు 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.51 సెకన్లలోనే దూస్కెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నిశాంత్ శెట్టి కర్ణాటకలోని బజగోళి జోగిబెట్ట ప్రాంతానికి చెందినవాడు. ఈ పోటీల్లో నిశాంత్ శెట్టి మొత్తం 143 మీటర్ల దూరాన్ని 13.68 సెకన్లలో పూర్తి చేశాడు.

Latest Updates