తుమ్మల నై.. అజయ్‌‌ సై..

మొన్నామధ్య కేటీఆర్‌‌  తెలంగాణ భవన్‌‌కు వచ్చినపుడు కొందరు ఎమ్మెల్యేలు సపరేట్‌‌గా ఒక మీటింగ్‌‌ పెట్టుకున్నరట. వాళ్లంతా కమ్మ కులం ఎమ్మెల్యేలు. కేసీఆర్‌‌ తమ కులానికి మంత్రి పదవి ఇస్తే ఎవరికి రావాలె అన్న దాని మీద వాళ్లంతా కిందా మీదా పడ్డరట. చివరికి అందరు కల్సి ఒక పేరనుకున్నరట. కమ్మోళ్లకు ఎప్పుడు మంత్రి పదవి అనే ముచ్చట వచ్చినా తుమ్మల నాగేశ్వర్‌‌ రావు పేరే వినిపిస్తదనీ, ఈసారి ఆయనకు కాకుండా పువ్వాడ అజయ్‌‌కు ఇవ్వాలని తీర్మానించుకున్నరట. అదే ముచ్చటను అందరూ కల్సి కేటీఆర్‌‌  దగ్గరకు పోయి చెప్పిన్రట. అజయ్‌‌ కిస్తే మా అందరికీ ఇచ్చినట్టే అన్నరట.

Latest Updates