సీక్వెల్‌గా ‘రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్’

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను ఆర్జీవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందే ఎన్నో వివాదాలకు కారణమైంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా సినిమాను పూర్తి చేసి విడుదల చేస్తానని ఆర్జీవీ చెప్పారు.

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాకు సీక్వెల్‌ తీస్తానని తాజాగా ఆర్జీవీ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. గురువారం వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆ తర్వాత వంశీ ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారు. ఆ ప్రెస్‌మీట్ చూసిన ఆర్జీవీకి ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాకు సీక్వెల్‌ తీయాలనే ఆలోచన తట్టిందట. దానికి ‘రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్ ’ అని టైటిల్ పెడతానని ఆయన అన్నారు. మరి ఆ ప్రెస్‌మీట్‌లో ఆర్జీవీ ఏం చూశారో.. ఏం విన్నారో ఆయనకే తెలియాలి. విడుదలకు ముందే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాకు వివాదాల కారణంగా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ వచ్చింది. మరి ఇప్పుడు దానికి సీక్వెల్ అంటే ఇది ఎలా ఉండబోతుందో చూడాలి. ఆర్జీవీ సీక్వెల్ తీస్తానని కామెడీకి అన్నాడో, సీరియస్‌గా అన్నాడో తెలియదు కానీ, అదే నిజమైతే ప్రేక్షకులకు మాత్రం మరో ఎంటర్‌టైన్‌మెంట్ లభించినట్లే.

Latest Updates