కొడుకు మీద ప్రేమతో తండ్రి.. పార్టీని నాశనం చేశాడు : రెండో ట్రైలర్

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను ఆర్జీవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. టైగర్ కంపెనీ ప్రొడక్షన్, అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఆర్జీవీ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచి ఎన్నో వివాదాలు రేగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, కెఎ. పాల్, లోకేష్ తదితర పాత్రలన్నీ ప్రేక్షకుల్లో ఎంతో ఉత్కంఠతను రేపుతున్నాయి. పాటలు, ట్రైలర్ విడుదలచేసిన ఆర్జీవీ.. తాజాగా సినిమా నుంచి మరో ట్రైలర్‌ను తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో కొడుకు మీద ప్రేమతో తండ్రి పార్టీని మొత్తం నాశనం చేశాడంటూ ఆర్జీవీ వాయిస్ చెప్పడం, అసెంబ్లీలో జగన్ పాత్రధారి చంద్రబాబును ఉద్దేశించి ‘కూర్చొ.. కళ్లు పెద్దవి చేస్తే ఎవరూ భయపడరిక్కడ’ అంటూ వార్నింగ్ ఇవ్వడం.. ఇవన్నీ చూస్తుంటే సినిమాలో డైలాగులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా నవంబర్ 29న విడుదలకు సిద్ధమయింది.

Latest Updates