కమ్మరాజ్యంలో కాదు.. అమ్మరాజ్యంలో కడపరెడ్లు : వర్మ

కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా మంచి సందేశాత్మక చిత్రమని, ఆ సినిమా డైరక్టర్ వర్మ తెలిపారు.  సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఓ పార్టీకి చెందిన అగ్రనాయకుల్ని కించపరిచేలా ఉందంటూ పలువురు  హైకోర్ట్ ను ఆశ్రయించారు.  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ హైకోర్ట్ ను ఆశ్రయించారు. తన ప్రతిష్టను భంగం కలిగించేలా ఉందని, సినిమా విడుదల కాకుండ తక్షణమే నిలిపివేయాలని కోరారు. పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్ట్ ..సినిమాపై అభ్యంతరాలు ఉన్నాయా..? ఉంటే ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయనే అంశాల్ని పరిగణలోకి తీసుకొని సినిమాను విడుదలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన వర్మ..సినిమా పేరును మారుస్తున్నట్లు ప్రకటించారు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాను అమ్మరాజ్యంలో కడపరెడ్లుగా మారుస్తున్నట్లు తెలిపారు. కోర్ట్ తీర్పు అనంతరం ఈ పేరును మారుస్తామని చెప్పారు. సినిమాపై వస్తున్న కామెంట్స్ పై  స్పందించిన వర్మ..తాను ఎవరిని కించపరిచేందుకు సినిమా తీయలేదని, సినిమా కోసమే కొన్ని క్యారక్టర్లను సృష్టించినట్లు చెప్పారు.  సినిమాలో పప్పు అనే పాట తండ్రీ కొడుకుల మధ్య అనురాగమైన పాటని వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Latest Updates