యాదాద్రికి చేరిన గోదావరి

యాదాద్రి, వెలుగు:యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గాన్ని గోదావరి జలాలు తాకాయి. నియోజకవర్గం పరిధిలోని తుర్కపల్లి మండలంలోని చెరువుల్లోకి గోదావరి నీళ్లు చేరాయి. సిద్దిపేట జిల్లా మర్కూక్​ మండలంలో నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ 2వ గేటును బుధవారం ఉదయం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, అటవీ అభివృద్ధి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. రిజర్వాయర్ నుంచి మేడ్చల్ జిల్లా శామీర్ పేట వైపు వెళ్లే ప్రధాన కాల్వలోకి చేరిన నీళ్లు.. సాయంత్రానికి తుర్కపల్లి మండలం గోపాలపురం వద్దకు వచ్చాయి. అప్పటికే అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే సునీత పూజలు చేసి బోనాలు సమర్పించి గేటు ఓపెన్​ చేశారు. దీంతో నీళ్లు నల్ల పోచమ్మ చెరువుకు చేరాయి. ఇక్కడి మరో 4 చెరువులు, బొమ్మల రామారం మండలంలోని 6 చెరువులు నిండనున్నాయి. వీటికింద 1,100 ఎకరాలకు సాగునీరు అందనుంది. గోపాలపురం వద్ద గోదావరి నీళ్లు విడుదల చేశాక సునీత మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ అపర భగీరథుడని కొనియాడారు. రానున్న రోజుల్లో ఇక్కడి అన్ని చెరువులు నింపుతామన్నారు. ఊహించని రీతిలో సాగునీటిని అందిస్తున్న సీఎం పే రు చిరస్థాయిలో నిలు స్తుందని వంటేరు ప్ర తాప్ రెడ్డి అన్నారు.

చనిపోయాక కరోనా అని తేలింది

Latest Updates