మాజీ బాయ్‌‌ఫ్రెండ్ గురించి కంగన ట్వీట్

ముంబై: అక్రమ కట్టడమంటూ బాలీవుడ్ క్వీన్ కంగనా ఆఫీసును మహారాష్ట్ర సర్కార్ కూల్చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై బాంబే హైకోర్టుకు వెళ్లిను కంగనాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కంగనా ఆఫీసును కూల్చినందుకు బృహన్ ముంబై కార్పొరేషన్‌‌ (బీఎంసీ)పై కోర్టు సీరియస్ అయ్యింది. కంగనాకు నష్ట పరిహారం చెల్లించాలంటూ బీఎంసీకి కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు మీద కంగన స్పందిస్తూ ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌‌లో తన మాజీ బాయ్‌‌ఫ్రెండ్ హృతిక్ రోషన్‌‌ గురించి కామెంట్ చేసింది.

‘మహారాష్ట్ర సర్కార్ నుంచి గత కొన్ని నెలల్లో నేను ఎదుర్కొన్న లీగల్ కేసులు, తిట్లు, అవమానాలు.. బాలీవుడ్ మీడియాతోపాటు ఆదిత్యా పంచోలి, హృతిక్ రోషన్ లాంటి కొందరిని ఎబ్బెట్టుగా కనిపించేలా చేశాయి. నా గురించి ప్రజలు ఏమనుకుంటారోననే ఆసక్తిని పెంచింది’ అని కంగన ట్వీట్ చేసింది.

Latest Updates