ఆరు నెలల తర్వాత సినిమా షూటింగ్ లో కంగన రనౌత్

షూటింగ్ కోసం హైదరాబాద్ లో…
కాంట్రవర్సీ కామెంట్స్‌‌‌‌కి కేరాఫ్ అడ్రస్‌‌ అయిన కంగనా రనౌత్‌‌‌‌.. దాదాపు ఆరు నెలల గ్యాప్‌‌‌‌ తర్వాత తిరిగి సినిమా షూటింగ్‌‌‌‌లో పాల్గొంటోంది. జయలలిత జీవితం ఆధారంగా ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తలైవి’. ఈ మూవీ షూటింగ్‌‌‌‌లో పాల్గొంటున్న విషయాన్ని రివీల్ చేస్తూ కంగన ట్వీట్ చేసింది. నిన్న ఉదయం జరిగిన సీన్‌‌ డిస్కషన్‌‌ స్టిల్స్‌‌ని కూడా షేర్ చేసిన కంగన.. సెట్‌‌‌‌లో సింపుల్‌‌‌‌గా శారీలో కనిపించింది. ‘ప్ర‌‌‌‌పంచంలో ఎన్నో అత్యద్భుత‌‌‌‌మైన ప్ర‌‌‌‌దేశాలు ఉన్నప్పటికీ తనకి చాలా కంఫ‌‌‌‌ర్ట్‌‌‌‌గా ఉన్న చోటు సినిమా సెట్’ అని చెప్పింది.

మోస్ట్ టాలెంటెడ్ అండ్‌‌‌‌ ఎఫెక్షనేట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ అంటూ విజయ్‌‌‌‌కి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చింది. మొత్తానికి ‘తలైవి’ షూటింగ్‌‌‌‌ శరవేగంగా జరుగుతోందనే విషయంతో పాటు తాను కంఫర్ట్ జోన్‌‌‌‌లో ఉన్నాననే విషయాన్నీ కన్‌‌ఫర్మ్‌‌ చేసింది కంగన. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వంపై తాను చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ దృష్ట్యా భద్రతా కారణాలతో కేంద్రం కంగనకి వై కేటగిరీ భద్రత కల్పించింది. దీంతో షూటింగ్‌‌‌‌ కోసం పది రోజుల పాటు హైదరాబాద్‌‌‌‌లో స్టే చేస్తున్నప్పటికీ పోలీసులు ఆ విషయాన్ని సీక్రెట్‌‌‌‌గా ఉంచుతున్నారు. మరోపక్క తనకి జయలలిత లుక్ తీసుకొచ్చేందుకు హాలీవుడ్‌‌‌‌ మేకప్ ఆర్టిస్ట్ గ్యారీ ఓల్డ్​మెన్‌‌‌‌తో మేకప్ చేయించారు. అయితే కరోనా వల్ల ఆయన ఇప్పుడు ఇండియా రాలేకపోవడంతో లోకల్ మేకప్‌‌‌‌ టీమ్‌‌‌‌తోనే సర్దుకుపోతున్నట్టు తెలుస్తోంది.

Latest Updates