నా ఇల్లు ఎందుకు కూల్చారు రూ.2కోట్లు చెల్లించండి..బీఎంసీకి కంగన నోటీసులు

తనకు రూ.2కోట్లు కట్టాలని కోరుతూ బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్ బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కు నోటీసు జారీ చేశారు.

అక్రమ కట్టడాల పేరుతో సెప్టెంబర్ 9న బాంద్రా వెస్ట్ లో ఉన్న కంగన ఆఫీస్ ను బీఎంసీ అధికారులు పాక్షికంగా కూల్చివేశారు. అదే రోజు కంగన కూల్చివేత సరికాదంటూ బాంబే హైకోర్ట్ తీర్పిచ్చింది. హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ బీఎంసీ అధికారులు సెప్టెంబర్ 10న కంగన అక్రమ నిర్మాణాలు చేపట్టారని వాదిస్తూ పిటిషన్ దాఖలు చేశారు.అక్రమ కట్టడాల్ని కప్పి పుచ్చేందుకు కంగన తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.

కంగన సైతం తన కార్యాలయం కూల్చివేతను నిలిపివేయాలని కోరుతూ కంగనా రనౌత్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆపై కంగనా కార్యాలయ కూల్చివేతపై కోర్టు స్టే విధించి నటి పిటిషన్‌పై అఫిడవిట్‌ దాఖలు చేయాలని బీఎంసీని ఆదేశించింది. కంగనా న్యాయవాది అఫిడవిట్ పై స్పందించడానికి సమయం కోరడంతో కోర్టు ఈ విషయాన్ని సెప్టెంబర్ 22 వరకు వాయిదా వేసింది.

ఆ తరువాత కంగన తన ఇంటిని పుననిర్మించేందుకు డబ్బులేదని ట్వీట్ చేసింది. జనవరి 15,2020లో ఆఫీస్ ను ప్రారంభించారు.ఆ తరువాత కరోనా వ్యాప్తి చెందడంతో ఎలాంటి ఇన్ కమ్ లేదు. ఏం చేయాలి. కూల్చేసినా సరే నేనుఇక్కడి నుంచే పనిచేస్తానని చెప్పింది.

తాజాగా అదే ఇంటిని పుననిర్మించుకోవాలని, నిర్మాణల నిమిత్తం రూ.2కోట్లు చెల్లించాలని కంగన బీఎంసీకి నోటీసులు జారీ చేసింది.

Latest Updates