పప్పూసేన నన్ను బాగా మిస్సవుతోంది

న్యూఢిల్లీ: మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ట్వీట్లు చేయడంతోపాటు ఇంటర్వ్యూల్లో మాట్లాడారనే అభియోగంపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌‌ మీద తాజాగా కేసు నమోదైంది. హిందూ, ముస్లిం ఆర్టిస్టుల మధ్య సామాజిక విభజన తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారని కాస్టింగ్ డైరెక్టర్, ఫిట్‌‌నెస్ ట్రైనర్ మున్నారవలీ సయీద్ కంగనాపై ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన బాంద్రా మెట్రోపాలిటన్ కోర్టు కంగనాతోపాటు ఆమె సోదరి రంగోలి చండీలాపై ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులకు  ఆదేశించింది.

ఈ వివాదంపై కంగన స్పందించింది. మహారాష్ట్ర సర్కార్‌‌ను పప్పూసేనగా పేర్కొంటూ ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ‘నవరాత్రి సందర్భంగా ఎవరెరవరు ఉపవాసం ఉంటున్నారు? నేను ఉపవాసంలో ఉన్న సమయంలో తీసిన ఫొటోలివి. దీన్ని పక్కనబెడితే.. నాపై మరో ఎఫ్‌‌ఐఆర్ నమోదైంది. మహారాష్ట్రలోని పప్పూసేన నన్ను ఎక్కువగా మిస్ అవుతున్నట్లు కనిపిస్తోంది. నన్ను మరీ అంతగా మిస్సవ్వొద్దు. త్వరలోనే నేను అక్కడికి వస్తా’ అని కంగన ట్వీట్ చేసింది.

Latest Updates