వాళ్ల బతుకులు నరకం చేస్తా.. ట్విట్టర్ ఆంక్షలపై కంగన ఫైర్

ముంబై: బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించిన తాండవ్ వెబ్ సిరీస్ పై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వివాదాస్పద కామెంట్స్ చేసింది. హిందూ దేవుళ్లను అవమానించారంటూ తాండవ్ మేకర్స్‌‌పై కంగన విరుచుకుపడింది. ఆ సిరీస్ మేకర్స్‌‌ను ఉద్దేశించి.. వాళ్ల తలలు తీసేయాల్సిన సమయమిదే అంటూ ఓ ట్వీట్ చేసింది. దీంతో ఆమె అకౌంట్‌‌పై ట్విట్టర్ నియంత్రణ విధించింది.  కంగన  చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్‌‌కు సంబంధించిన ట్వీట్స్‌ను తొలగించింది.

దీంతో ఉదారవాదులు తన అకౌంట్‌‌పై నియంత్రణ విధించాలని ట్విట్టర్ సీఈవో, కో-ఫౌండర్ జాక్ డోర్సేను సంప్రదించారని కంగన మరో ట్వీట్‌లో విమర్శించింది. జాక్ డోర్సేను చాచాగా పిలుస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తన వర్చుకవల్ ఐడెంటిటీని తొలగిస్తామని వార్నింగ్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ తన దేశభక్తిని సినిమాల ద్వారా చూపిస్తానని, తన ఐడెంటిటీని తొలగించాలని చూస్తున్న వారి బతుకు నరకం చేస్తానని హెచ్చరించింది.

Latest Updates