కంగనతో పాటు ఆమె సోదరిని వదలని ముంబై పోలీసులు

బాలీవుడ్  నటి కంగన రనౌత్ తో పాటు ఆమె సోదరి రంగోలీ చాందల్‌ కి ముంబై పోలీసులు ఇవాళ(బుధవారం) సమన్లు జారీ చేశారు. ఉద్రిక్తతలు పెంచేలా మత సంబంధిత అంశాలపై సోషల్ మీడియాల్లో వారిద్దరు చేసిన వ్యాఖ్యలపై ఈ నోటీసులు పంపారు. నవంబరు 23న కంగన రనౌత్, నవంబరు 24న రంగోలీ బంద్రా పోలీసు స్టేషన్‌లో తమ ముందు హాజరై వాటిపై సమాధానం చెప్పాలని పోలీసులు ఆదేశించారు.

కంగన రనౌత్, రంగోలీకి ముంబై పోలీసులు సమన్లు పంపడం ఇది మూడోసారి. అక్టోబరు 26, 27 తేదీల్లో ఓసారి, నవంబరు 9, 10 తేదీల్లో మరోసారి తమ ముందు హాజరుకావాలంటూ పోలీసులు వారిని ఆదేశించినా.. వారు హాజరుకాలేదు. తాను బిజీగా ఉన్నానని, తమ కుటుంబంలోని ఒకరి పెళ్లి ఉందని, నవంబరు 15 తర్వాత ఫ్రీగా ఉంటానని కంగన అప్పట్లో తెలిపింది.

Latest Updates