అనురాగ్ కశ్యప్ ను అరెస్ట్ చేయండి : కంగన రనౌత్

అనురాగ్ కశ్యప్ లైంగికంగా వేధించారని, తనకు సాయం చేయాలని పాయల్ ఘోష్ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. తాజాగా అనురాగ్ కశ్యప్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన పాయల్ ఘోష్‌కు కంగన రనౌత్ మద్దతు పలికారు. కంగన రనౌత్, పాయల్ ట్వీట్‌ను రీట్వీట్ చేసి అనురాగ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాలీవుడ్‌లో అవకాశాల కోసం వచ్చే నటీమణులపై లైంగిక వేధింపులకు పాల్పడతారని అన్నారు. కొన్ని సందర్భాల్లో తను కూడా అలాంటి వేధింపులను ఎదుర్కొన్నానని ట్వీట్ చేసింది. పాయల్ ఘోష్ పట్ల అనురాగ్ కశ్యప్ ప్రవర్తన బాలీవుడ్ లో కామన్ ప్రాక్టీస్ వంటిదే అని కంగనా తెలిపింది

Latest Updates