నా బయోపిక్ నేనే తీస్తున్నా: కంగన

మనికర్ణిక సినిమాతో విజయం సాధించిన కంగనా రనౌత్.. త్వరలో తన బయోపిక్ ను తీస్తున్నట్లు తెలిపింది. బాహుబలి, బజరంగీ బాయ్ జాన్, మనికర్ణిక సినిమాలకు కథను అందించిన ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్.. తన బయేపిక్ కు స్ర్కిప్ట్ ను రెడీ చేస్తున్నారని చెప్పింది. “నా బయోపిక్ కు నేనే దర్శకత్వం వహిస్తున్నా.. నేను ఈ ఇండస్ట్రీ లో పడిన కష్టాలు, విజయాన్ని అందుకునేందుకు ఎవరు సహాయం చేశారో, ఎవరు నన్ను వంచించారో వంటి విషయాలు నా బయోపిక్ లో ఉండనున్నాయి” అని కంగన తెలిపింది.

బయోపిక్ లో ఎవరి పేర్లను..  డైరెక్ట్ గా ప్రస్తావించకుండా అందరి గురించి చెప్తానని కంగన చెప్పారు. పర్వత ప్రాంతం నుంచి వచ్చిన ఒక అమ్మాయి.. బాలీవుడ్ లో ఒక స్టార్ హీరోయిన్ గా ఎలా పేరు తెచ్చుకుందన్న కథాంశంతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చెప్పారు.

Latest Updates