మీరు విలన్స్ అయ్యారు.. నేను హీరో అయ్యాను

ముంబై: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఆఫీసును అక్రమ కట్టడం పేరుతో బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మహారాష్ట్ర సర్కార్‌‌ను సవాల్ చేస్తూ కంగనా బాంబే హైకోర్టుకు వెళ్లింది. కంగన పిటిషన్‌‌పై విచారణ జరిపిన కోర్టు.. సదరు ఆఫీసును కూల్చినందుకు బీఎంసీపై మండిపడింది. పిటిషనర్‌‌కు నష్ట పరిహారాన్ని చెల్లించాల్సిందిగా బీఎంసీని ఆదేశించింది. కాగా, ఈ తీర్పు వెలువడిన తర్వాత తనకు మద్దతుగా నిలిచిన వారికి కంగన కృతజ్ఞతలు తెలిపింది.

‘ఎప్పుడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా వ్యక్తిగతంగా నిలబడి విజయం సాధిస్తారో అది వారొక్కరి గెలుపే కాదు. దాన్ని ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా చూడాలి. నాకు ధైర్యాన్ని ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు. అలాగే బద్దలైన నా కలలను చూసి నవ్విన వారికి కూడా కృతజ్ఞతలు. మీరు విలన్‌‌ పాత్రలో నటించారు కాబట్టే నేను హీరో అయ్యాను’ అని కంగన ట్వీట్ చేసింది.

Latest Updates