నేను బార్డర్‌‌కు వెళ్తా.. మీరు ఒలింపిక్స్‌‌లో ఆడండి!

న్యూఢిల్లీ: బాలీవుడ్‌‌‌లో డ్రగ్స్ వాడకంపై కంగన రనౌత్ చేసిన కామెంట్స్‌‌పై అగ్గి రాజుకున్న సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై వెటరన్ హీరోయిన్ ఊర్మిలా మతోండ్కర్ మండిపడిన విషయం విధితమే. ఊర్మిల కామెంట్స్‌‌పై విరుచుకుపడిన కంగనా ఆమెను సాఫ్ట్ పార్న్ స్టార్ అని పేర్కొంది. తాజాగా కంగనాపై హిందీ టాప్ డైరెక్టర్స్‌‌లో ఒకడైన అనురాగ్ కశ్యప్ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. సరిహద్దుల్లో ఇండో-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో బార్డర్‌‌కు వెళ్లి యుద్ధం చేయాల్సిందిగా కంగనాకు అనురాగ్ సూచించాడు.

‘మిగిలి ఉన్న ఏకైక మణికర్ణికవు నువ్వే సోదరి. ఓ నలుగురైదుగురిని తీసుకొని చైనాపై పోరుకు వెళ్లు. వాళ్లు ఎంతగా చొచ్చుకువచ్చారో చూడు. నువ్వు ఉన్నంత వరకు ఈ దేశాన్ని ఎవ్వరేం చేయలేరని నిరూపించు. ఎల్ఏసీకి నీ ఇంటి నుంచి కేవలం ఒక్క రోజు ప్రయాణించేంత దూరమే కదా. వెళ్లు శివంగి’ అని అనురాగ్ కశ్యప్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌‌కు కంగన కూడా వ్యంగ్యంగా బదిలిచ్చింది. ‘సరే నేను బార్డర్‌‌కు వెళ్తా. మీరు వచ్చే ఒలింపిక్స్‌‌లో పాల్గొనండి. దేశానికి గోల్డ్ మెడల్స్ కావాలి. కళాకారులు ఎలాగైనా మారిపోవడానికి ఇదేం బీ-గ్రేడ్ ఫిల్మ్ కాదు. మీరు రూపకాన్ని తీసుకోవడం మొదలెట్టారుగా. ఇంత మందబుద్ధిగా ఎప్పట్నుంచి తయారయ్యారు? మనం మిత్రులుగా ఉన్నప్పుడు చాలా తెలివిగా ఉండేవాళ్లు’ అని కంగన రిప్లయి ఇచ్చింది.

Latest Updates