ఖాన్స్ మరియు కరణ్ జోహర్ సినిమాలను బాయ్ కాట్ చేస్తాను

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆకస్మిక మరణంతో కంగనా రనౌత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఇక నుంచి ఖాన్స్ మరియు కరణ్ జోహర్ సినిమాలను బాయ్ కాట్ చేస్తానని ట్వీట్ చేసింది. సుశాంత్ మరణం సినీపరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సుశాంత్‌ సింగ్‌ మరణంపై కొంతమంది మీడియా వ్యక్తులు రాసే వార్తలపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించింది. సుశాంత్‌ సింగ్‌ మానసిక ఒత్తిడికి లోనవడం వల్లే చనిపోయాడని ఆమె తెలిపింది. అంతేకాని ఆర్థికసమస్యల వల్ల కాదని ఆమె అన్నారు. సుశాంత్‌ సింగ్‌ది ఆత్మహత్యా? లేక హత్యా? అని ప్రశ్నిస్తూ కంగనా మంగళవారం ఓ వీడియో ట్వీట్ చేసింది. ఖాన్స్ మరియు కరణ్ జోహర్ ల వల్లే సుశాంత్ చనిపోయాడని సోషల్ మీడియాలో వార్తలు ట్రోల్ అవుతున్నాయి. ఇటువంటి సమయంలో కంగనా ఖాన్స్ మరియు కరణ్ జోహర్ ల సినిమాలను బాయ్ కాట్ చేస్తానని ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా.. ఈ విషయంలో తనకు సపోర్టుగా ఎవరుంటారని కూడా అడిగింది. దాంతో నెటిజన్లు కంగనాకు మద్దతుగా మేం కూడా వారి సినిమానలు బాయ్ కాట్ చేస్తామంటూ రీట్వీట్లు ట్రోల్ చేస్తున్నారు.

For More News..

అండర్ -19 మహిళా క్రికెటర్ ఆత్మహత్య

గాంధీభవన్ లో కరోనా కలకలం.. వారం రోజులుగా నాయకులంతా అక్కడే ప్రెస్ మీట్

సీఎం సెక్రటరీకి కరోనా పాజిటివ్

Latest Updates